MADHU

MADHU
i am cool

Sunday, 11 September 2011

మళ్ళీ సినిమా అంటున్నా చిరు


చిరంజీవి 150వ సినిమా చేస్తారా..?
ప్రజారాజ్యం బాధ్యతలు లేవు కాబట్టి.. మళ్లీ నటనపై దృష్టి పెడతారా..?
త్వరలోనే మెగా సినిమా మొదలవుతుందా..?

మనసు మార్చుకోవడాన్నే పనిగా పెట్టుకున్న చిరంజీవి మళ్లీ మాటతప్పేలా ఉన్నారు. సినిమాలు చేయనని.. ఒక్క సినిమా చేస్తానని.. ఇక ఛాన్సే లేదని.. గందరగోళంగా ఎన్నో ప్రకటనలు చేసిన మెగాస్టార్..
తాజాగా మరో సీక్వెల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఫ్యాన్స్‌కు కొత్త సంకేతాలు పంపారు.. 150 వ సినిమా ఎప్పుడని అంతా అడుగుతున్నారని, తాను కూడా ఆ విషయాన్ని ఆలోచిస్తున్నానని తెలిపారు. ఒక్కటీ చేస్తే 150 సినిమాలు పూర్తవుతాయి కాబట్టి.. తాను కూడా అందుకు సిద్ధమేనని చెప్పేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్రమంత్రి జైరాంరమేశ్ కూడా 150వ సినిమా ఎప్పుడని అడిగారని చిరు చెప్పారు. మీదాకా ఈ విషయం వచ్చిందా అని అడగ్గా.. అంతా మరో సినిమా చేయాలని కోరుకుంటున్నారని జైరాం సమాధానమిచ్చారని మెగాస్టార్ అన్నారు. 150 వ సినిమా విషయాన్ని చూద్దాం అంటూ తనదైన స్టైల్లో చెప్పారు.హైదరాబాద్‌లో ఓ డిజైనర్ బొటిక్‌ను ప్రారంభించిన చిరు, డిజైనర్ వేర్‌ను చూసి తెగ ఫీలయ్యారు. సినీ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ, ఇప్పటికీ తన లైఫ్‌లో చాలా మార్పులు వచ్చాయని చిరంజీవి చెప్పారు. రాజకీయాల కారణంగా తనను తాను కంట్రోల్ చేసుకోవాల్సి వస్తోందన్నారు.. ఇంతకీ చిరంజీవి సినిమా చేయాలనుకొంటోంది ఎందుకోసం.. జైరాం రమేశ్ అడిగారనా..? లేక, మోడ్రన్‌ వేరు వేసుకోవచ్చనా..? కారణం ఏమిటన్నది పక్కన పెడితే.. ఇప్పుడు చెప్పిన మాటమీద అన్నయ్య నిలబడతారా..? మళ్లీ నో ఛాన్స్.. అంటారా..?

No comments:

Post a Comment