Grammar అంటే తెలుసు కదా? వాక్యనిర్మాణం, మాటల వాడకం లాంటివాటికి సంబంధించింది. English లో తప్పులు లేకుండా మాట్లాడాలన్నా,రాయాలన్నా grammar తెలుసుకోవడం అవసరం. అయితే grammar తెలిసినంత మాత్రాన, grammar నిబంధనలన్నీ అంత బాగా గుర్తుండకపోవచ్చు.అందుకే మన భాష తప్పులు లేకుండా ఉంటుందనుకోవడానికి వీల్లేదు.Grammar తెలుసుకోవడంతోపాటు రాయడం, మాట్లాడటం regular గా practice చేయడం చాలా ముఖ్యం. మాట్లాడటం, రాయడం, చదవడం లాంటివి సాధనచేయకపోతే ఫలితం ఉండదు.
ఈ grammar అందివ్వడంలో ముఖ్యోద్దేశాలు రెండు. మొదటిది, అన్నింటి కంటే ముఖ్యమైందీ, మీరు correct గా మాట్లాడగలిగేందుకు, రాయగలిగేందుకు సహాయపడటం. రెండోది - ఇప్పుడు అన్ని తరగతుల, పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు grammar కే ఉంటున్నాయి. కాబట్టి వాటిని మీ సొంతం చేసుకునేందుకు చేయూతను అందించడం. ఈ grammar lessons చదివి, అర్థం చేసుకుని practice చేస్తే మీరు చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు. తప్పులు లేకుండా రాయగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. |
|
1. Sentence: A group of words with complete
meaning.
1) New Delhi is the capital of India (ఇండియా రాజధాని ఢిల్లీ) ఇది పూర్తి అర్థాన్నిచ్చే మాటలసమూహం. కాబట్టి ఇది sentence. 2) What are you doing? (నువ్వేం చేస్తున్నావు?) |
ఇది కూడా పూర్తి అర్థాన్నిచ్చే group of words కాబట్టి, ఇది sentenceఅవుతుంది.
3) Read the lesson (పాఠం చదువు), and 4) How tall he is! (అతనెంత పొడుగ్గా ఉన్నాడో!) కూడా sentences. ప్రతి sentence ఏదో ఒక దాన్ని గురించి చెబుతుంటుంది కదా? అది ఆsentence కు subject అవుతుంది. For example, sentence (1), New Delhi ని గురించి చెబుతోంది. కాబట్టి New Delhi, sentence (1) కు subject.అలాగే sentence (2) కు subject, 'you', sentence (4) కి 'he' subjectఅవుతాయి. sentence (3), Read the lesson = You read the lesson.. ఇక్కడ -you subject అవుతుంది. అయితే ఇలాంటి sentences లో you మామూలుగావాడం. మనం ఇంత వరకు తెలుసుకున్నది: Sentence దేన్ని గురించి చెబుతోందో, అది దాని subject అవుతుంది.ఇదెప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. Sentences లో కూడా రకాలుఉంటాయి. |
1.
ఏదైనా ఒక విషయాన్ని తెలిపేది.
e.g.: a) He comes here in the evenings. (అతడు ఇక్కడికి సాయంత్రం పూట వస్తాడు.) b) I Know English. (నాకు ఇంగ్లిష్ తెలుసు.) ఇలాంటి sentences, statements ను assertive sentences అని కూడా అంటారు. (state = చెప్పడం) |
a) Where is he?
(అతడెక్కడ? )
b) What is your name? ఇలాంటి questions ను interrogative sentences అని కూడా అంటారు.
( Interrogate = ప్రశ్నించడం).
3. ఇక మూడోరకం sentences, imperative sentences. అంటే ఇవి ఆజ్ఞలను,అభ్యర్థనలను (order & requests) తెలుపుతాయి.
(you) sit down
{(నువ్వు) కూర్చో}.
(you) Please come in
(లోపలికి రండి - అభ్యర్థన).
ఈ imperative sentences అన్నింటికి subject మామూలుగా 'you'ఒక్కోసారి అంటాం, మామూలుగా వదిలేస్తాం ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి